Nani - Sujeeth: నానితో పూజ.. సుజీత్ ఫిక్స్ చేసేశాడా..
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:45 PM
నేచురల్ స్టార్ నాని (Nani)ప్రస్తుతం 'ప్యారడైజ్'(Paradise) సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది
నేచురల్ స్టార్ నాని (Nani)ప్రస్తుతం 'ప్యారడైజ్'(Paradise) సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తదుపరి నాని సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. దీనికి ‘బ్లడీ రోమియో’ (bloody romio) అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది రెండో భాగంలో మొదలుకానుంది. ప్రస్తుతం చిత్ర బృందం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపికలో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో నాని సరసన పూజా హెగ్డే (pooja hegde)కథానాయికగా నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలిసింది. ప్రస్తుతం నాని ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల సుజీత్ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇందులో మలయాళస్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణ. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.