బన్నీతో బుట్టబొమ్మ.. ఏం అదృష్టమమ్మా
ABN , Publish Date - May 13 , 2026 | 02:13 PM
బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)కు అదృష్టం పడిశం పట్టినట్లు పట్టింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అని పేరు పడింది అంటే.. ఇక ఆ హీరోయిన్ గురించి మర్చిపోవచ్చు.
బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)కు అదృష్టం పడిశం పట్టినట్లు పట్టింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అని పేరు పడింది అంటే.. ఇక ఆ హీరోయిన్ గురించి మర్చిపోవచ్చు. ఒక్క ఫ్లాప్ వస్తేనే ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి సంకోచించే ఈ ఇండస్ట్రీలో పూజా వరుసగా అరడజను సినిమాలు డిజాస్టర్ అందుకున్నాయి. ఈ లెక్కన పూజా హెగ్డే పేరు కూడా ఎక్కడా వినిపించకూడదు. కానీ, అదేంటో ఈ చిన్నది వరుస ప్లాపులను అందుకున్నా అవకాశాలు మాత్రం కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి.
ప్రస్తుతం పూజా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె నటించిన జననాయగన్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇది కాకుండా హిందీలో వరుణ్ ధావన్ సరసన హే జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో పూజా నటిస్తోంది. ఇందులో అమ్మడి అందాల ఆరబోత చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు పూజా మరో లక్కీ ఛాన్స్ ని పట్టేసిందని సమాచారం.
అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తోన్న రాకా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. దీని తరువాత బన్నీ, మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్న విషయం తెల్సిందే. AA23 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే పేరును అనుకుంటున్నారట. ఇప్పటికే బన్నీతో పూజా దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో లాంటి సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట రొమాన్స్ చేయనున్నారు. త్వరలోనే లోకేష్ .. పూజాను అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించనున్నాడట.
అయితే పూజా అదృష్టం బానే ఉన్నా.. మార్కెట్ పరంగా బన్నీకి రిస్క్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. అమ్మడి ఖాతాలో వరుస ప్లాప్ లు ఉన్నాయి. జననాయగన్ ఏదైనా మ్యాజిక్ చేస్తే పూజాకు ప్లస్ అవుతుంది. లేకపోతే పూజాని తీసుకొని లోకేష్ రిస్క్ చేసినట్లే. మరి అమ్మడి అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.