సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Police Complaint: జూన్ 12న .. ‘పోలీస్ కంప్లైంట్’

ABN, Publish Date - Jun 09 , 2026 | 11:20 AM

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’

Police Complaint

హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint ). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా..ఈ నేప‌థ్యంలో ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్స్‌కు మంచి స్పందన లభించగా, ఇటీవ‌ల‌ సూపర్‌స్టార్ కృష్ణకు అంకితంగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను వీక్షించిన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్రబృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “సూపర్‌స్టార్ కృష్ణ గారిపై రూపొందించిన పాటను ఆదిశేషగిరిరావు గారు మెచ్చుకోవడం మా యూనిట్‌కు గొప్ప ప్రోత్సాహం. ఆయన ఆశీస్సులు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. 52 మంది సీనియర్ నటీనటులతో ఈ చిత్రాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వినూత్నమైన కాన్సెప్ట్ ఆధారంగా కథ సాగుతుంది. హారర్, థ్రిల్లర్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి” అని తెలిపారు.

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, “మా అభిమాన నటుడు సూపర్‌స్టార్ కృష్ణ గారికి అంకితంగా రూపొందించిన పాటలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ గీతాన్ని ఆదిశేషగిరిరావు గారు ప్రశంసించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు సంజీవ్ మేగోటి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి” అని చెప్పారు.

నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

Updated Date - Jun 09 , 2026 | 11:20 AM