Folk Song: ఈ ఫోక్ సాంగ్ ఏంటి.. ఇంత బావుంది! మైండ్‌లోంచి వెళ్ల‌ట్లేదు

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:05 PM

ఇటీవ‌ల తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను మ‌రో వైపు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Folk Song

ఇటీవ‌ల తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను మ‌రో వైపు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. నిత్యం ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి జాన‌ప‌ద పాట విడుద‌ల‌వుతూ ఓ రేంజ్‌లో అల‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే రాను నేను బొంబాయికి రాను, దారి పొంటొత్తుండు, పేరుగ‌ళ్ల పెద్దిరెడ్డి అంటూ పాట‌లు విశేషంగా ప్ర‌జాద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఈ కోవ‌కు చెందిన‌దే మ‌రో పాట ఈ మ‌ధ్య యూ ట్యూబ్‌లో రిలీజ్ అయి సెన్షేష‌న్ సృష్టిస్తోంది.

పొలుమారు పొలములో నాటు వేసే బావ (POLAMURU POLAMULO NATU VESE BAVA) అంటూ సాగే ఈ గీతం ఒక్క‌మారు వింటే చాలు మైండ్‌లో నుంచి పోయేలా లేదు. ప‌ర‌శురాం న‌గం (PARSHURAM NAGAM) స్వ‌యంగా సాహిత్యం అందించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాట‌కు శేఖ‌ర్ ఇచ్చోడ (SHEKAR ICCHODA) సంగీతం అందించాడు. జోగుల వెంక‌టేశ్ (JOGULA VENKATESH), మ‌మ‌త ర‌మేశ్ (MAMATHA RAMESH) ఆల‌పించారు. మ‌ను మైఖెల్ (MANU MICHEL) ఈ పాట‌కు నృత్య రీతులు స‌మ‌కూర్చ‌గా య‌మున తార (YAMUNA THARA), రోహిత్ జాక్స‌న్ (ROHITH JACKSON) న‌టించారు.

ముఖ్యంగా పాట కాన్సెప్ట్‌, గాత్ర‌ధారుల వాయిస్ అన్నింటికి మించి ట్యూన్ అద్బుతంగా ఉండి మ‌ళ్లీ మ‌ళ్లీ వినేలా ఉండ‌డం ఈ పాట ప్ర‌త్యేక‌త‌. ఒక్క‌మారు వింటే చాలు నాలుగైదు మార్లు రిపీట్ చేయ‌క మాన‌రు. అల్ల‌రి అబ్బాయి.. చిలిపి అమ్మాయి ఒక‌రినొక‌రు టీజ్ చేసుకుంటూ ఆడుతూ.. పాడుతూ పొలం ప‌నులు చేసుకునే థీమ్ కూడా బావుంది. మీరూ ఓ మారు లుక్ వేయండి.

Updated Date - Jan 20 , 2026 | 08:15 PM