Peddi: పెద్ది రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌... దర్శకుడు ప్రకటన..

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:18 PM

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న 'పెద్ది’ చిత్రం విడుదలపై క్లారిటీ వచ్చింది.

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా నటిస్తున్న 'పెద్ది’ (peddi) చిత్రం విడుదలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫైనల్‌గా జూన్‌ 25న విడుదల కానుందని రెండ్రోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే దీనిపై దర్శకుడు సాన బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. ధనుష్‌ హీరోగా నటించిన 'కర’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. అక్కడ 'పెద్ది రిలీజ్‌ ఎప్పుడు అని అభిమానులు గోల చేయగా బుచ్చి విడుదల తేదిని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్‌ 25 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు. (Peddi Release Date)

ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు దుమ్ము లేపేశాయి. త్వరలో ఓ డ్యూయెట్‌ రానుంది. ఆ తర్వాత శ్రుతీహాసన్‌, రామ్‌చరణ్‌పై చిత్రీకరిస్తున్న ప్రత్యేక గీతాన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. షూటింగ్‌ ఆలస్య, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సమయం సరిపోకపోవడం వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Updated Date - Apr 26 , 2026 | 11:56 PM