పెద్ది: ఫుల్‌ స్వింగ్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు..

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:30 PM

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉత్తరాంధ్రలోని స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయని పెద్ది టీమ్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది.


ఈ మేరకు ఎడిట్‌ సూట్‌లో దర్శకుడు బుచ్చిబాబు, నవీన్‌ నూలి వర్క్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసి ఎవ్రీ సీన్‌.. ఎవ్రీ ఫ్రేమ్‌ ఫైర్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్‌ను ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే పాటలు కూడా సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి.

Updated Date - Mar 14 , 2026 | 05:59 PM