Peddi: పెద్ది.. ఈసారి పక్కా
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:40 PM
పెద్ది (Peddi) వాయిదా అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. అందరూ అనుకున్నట్లే పెద్ది సినిమా వాయిదా పడింది.
Peddi: పెద్ది (Peddi) వాయిదా అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. అందరూ అనుకున్నట్లే పెద్ది సినిమా వాయిదా పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివన్న, బాలీవుడ్ యంగ్ ఆర్టిస్ట్ దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ షాట్, చికిరి చికిరి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మొదటి నుంచి పెద్ది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27 న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్, ప్రమోషన్స్ అన్ని సెట్ చేసుకున్నారు. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అన్నట్లు మేకర్స్ కూడా ఆపెద్ది మార్చి 27 న రావడం లేదని అధికారికంగా ప్రకటించారు. మార్చి 27 నుంచి తప్పుకొని ఏప్రిల్ 30 న పెద్ది రిలీజ్ కానుందని కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈసారి మాత్రం పక్కా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
అయితే నెల లేట్ గా వచ్చినా కూడా పెద్ది అరాచకం అలాగే ఉంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడు. రంగస్థలం తరువాత చరణ్ కెరీర్ లోనే డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాత చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.