Ram Charan: పెద్ది.. నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:59 AM

‘‘పెద్ది నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ‘పెది’ చాలా చేసింది. నటుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నన్ను వ్యక్తిగతంగా మార్చింది’’ అని అన్నారు రామ్‌చరణ్.

Ram Charan

‘‘పెద్ది (Peddi) నా జీవితంలో టాప్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ‘పెది’్ద చాలా చేసింది. నటుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నన్ను వ్యక్తిగతంగా మార్చింది’’ అని అన్నారు రామ్‌చరణ్ (Ram Charan). ఆయన కథానాయకుడుగా, జాన్వీ కపూర్‌ కథానాయికగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మించారు. సినిమా ఈనెల 4న విడుదలవుతున్న సందర్భంగా విజయవాడలో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

అ సంద‌ర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) దీన్ని కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. ఈ చిత్రంలో నటన కష్టంతో చేసిన పని కాదు. ఇష్టంతో చేసిన పని. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత పెద్దికి అలా అనిపించింది. ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల కోసం చేశా. వారి కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా’ అని అన్నారు.

‘‘ఈ చిత్రంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం. నా ఐడెంటిటీ తెలుగు నేలకు కనెక్ట్‌ అయి ఉంది’ అన్నారు హీరోయిన్‌ జాన్వీకపూర్‌. ‘ఎనిమిదేళ్ల తర్వాత మంచి క్యారెక్టర్‌ వచ్చింది. ఈ చిత్రంలో అప్పలసూరిగా బుచ్చిబాబు ఊహించారు.. ఆయన డిజైన్‌ చేసిన క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది’’ అని జగపతిబాబు అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ‘ఇది కమర్షియల్‌ ఫిల్మ్‌ కాదు. కమర్షియల్‌గా కనిపించే ఎమోషనల్‌ డ్రామా ఇది. ఆట ఒక మనిషికి గౌరవం, గుర్తింపు తీసుకొస్తుందని చెప్పే కథ’ అని అన్నారు. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. కార్యక్రమంలో గేయరచయిత అనంతశ్రీరాం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, చిత్ర నిర్మాతలు వెంకట సతీశ్‌ కిలారు, రవి తదితదరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 06:01 AM