Peddi: పెద్ది రిలీజ్‌.. విజిల్స్ వేస్తూ థియేట‌ర్‌లో ఉపాస‌న ర‌చ్చ‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 09:01 AM

పెద్ది చిత్రం ఓ రోజు ముందే బుధ‌వారం సాయంత్ర‌మే చాలా ప్రాంతాల‌లో బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్స్ ప్ర‌ద‌ర్శించ‌గా ప్రేక్ష‌కులు టికెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు.

Peddi

రామ్‌ చ‌ర‌ణ్ (Ram Charan), జాన్వీ (Janhvi Kapoor) జంట‌గా బుచ్చిబాబు సాన (Buchi Babu) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది (Peddi Movie). గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చేసింది.

అయితే.. ఓ రోజు ముందే బుధ‌వారం సాయంత్ర‌మే చాలా ప్రాంతాల‌లో బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్స్ ప్ర‌ద‌ర్శించ‌గా ప్రేక్ష‌కులు టికెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు. బీ, సీ సెంట‌ర్ల నుంచి సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా పెద్ది మానియాలోనే మునిగి పోయారు. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉత్సాహం చూపించారు.


ఈ నేప‌థ్యంలో అనేక‌మంది సెల‌బ్రిటీల‌తో పాటు స్వ‌యానా రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న (Upasana Kamineni Konidela) సైతంపెద్ది సినిమాను చూసేందుకు తండ్రితో క‌లిసి వ‌చ్చి థియేట‌ర్‌లో హంగామా చేశారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

అంతేగాక ఫ్యాన్స్‌కు థీటుగా విజిల్స్ వేస్తూ, పేప‌ర్లు ఎగుర‌వేస్తు ర‌చ్చ చేశారు. ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కాగా ఉపాస‌న క‌నిపించినంతా క్లాస్ ఏం కాద‌ని ఊర మాస్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఈ వీడియోపై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Jun 04 , 2026 | 09:32 AM