Peddi: ఎడిటింగ్‌ పూర్తి.. ఓవర్సీస్‌లో ఓ రోజు ముందే

ABN , Publish Date - May 07 , 2026 | 05:03 PM

రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది’ (Peddi). తాజాగా దర్శకుడు ఓ అప్డేట్ ఇచ్చారు

Peddi Update

రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ కథానాయిక. శృతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తారు. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా డైరెక్టర్‌ బుచ్చిబాబు కొత్త అప్‌డేట్‌ పంచుకున్నారు. ఎడిటింగ్‌ వర్క్‌ పూర్తయిందని తెలిపారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్  4న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుందని, ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే  సినిమాను  వీక్షించవచ్చని తెలిపారు. త్వరలో ట్రైలర్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Updated Date - May 07 , 2026 | 05:14 PM