Peddi: ఈ ఏడాది ప్రథమార్థానికి ‘పెద్ది’నే దిక్కు

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:10 PM

మే నెలలో సినిమాల మెరుపులు అంతంత మాత్రమే. ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’ (Peddi)పైనే. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనీ, బాక్సాఫీస్‌కు కళ తీసుకొస్తుందని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనం కూడా నమ్ముతున్నారు.

peddi


మే నెలలో సినిమాల మెరుపులు అంతంత మాత్రమే. ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’ (Peddi)పైనే. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనీ, బాక్సాఫీస్‌కు కళ తీసుకొస్తుందని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనం కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా హవా నడుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సినిమా కావడంతో సినిమా టీమ్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో సినిమాను ప్రమోట్‌ చేస్తోంది. సంక్రాంతి సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం, సమ్మర్‌ సినిమాలు కూడా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడంతో ఈ సీజన్‌కు ఇదే పెద్ద సినిమాగా నిలిచింది. దీనిపైనే ప్రేక్షకుల ఆశలున్నాయి. అలాగే ఈ సినిమాపై బరువు, బాధ్యత కూడా అలాగే ఉంది.

ఈ నెల మూడో తేదీ రాత్రి నుంచి పెద్ది ప్రీమియర్లు షురూ కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా జోరు గట్టిగానే ఉంది. ఓవర్సీస్‌లో అభిమానుల హంగామా మామూలుగా లేదు. నార్త్‌లో ‘పెద్ది’ ఎలా ఆడుతోంది అన్నదానిపై ఈ సినిమా స్థాయి ఆధారపడి ఉంటుంది.  నార్త్‌ ప్రేక్షకుల దృష్టి సినిమాపై పడటం కోసం రెహమాన్‌తో కలిసి భారీగా ప్రమోట్‌ చేశారు.  జాన్వీ కపూర్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌, చరణ్‌కి అక్కడున్న గుర్తింపునకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రెహమాన్‌ అందించిన పాటలు సౌత్‌తోపాటు నార్త్‌లోనూ చక్కని ఆదరణ పొందాయి. టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన దక్కింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. నార్త్‌ బెల్డ్‌కు కావలసిన అన్ని అంశాలు సమపాళ్లల్లో కుదిరితే బాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు రీ సౌండ్‌ రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయితే దర్శకుడి రేంజ్‌ మారిపోతుందని చెబుతున్నారు. 

Updated Date - Jun 01 , 2026 | 06:08 PM