ట్రైలర్ రిలీజ్ కాకముందే 'పెద్ది' రికార్డుల వేట.. అది రామ్ చరణ్ అంటే
ABN , Publish Date - May 08 , 2026 | 02:23 PM
సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ సత్తా ఏంటో తెలియాలంటే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ట్రైలర్ ఇచ్చే కిక్కును బట్టే ఆ సినిమా మార్కెట్ పొటన్షియాలిటీ ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ సత్తా ఏంటో తెలియాలంటే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ట్రైలర్ ఇచ్చే కిక్కును బట్టే ఆ సినిమా మార్కెట్ పొటన్షియాలిటీ ఆధారపడి ఉంటుంది. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఈ లెక్కలకు అతీతం. కేవలం క్రేజీ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకం, హీరో ఇమేజ్ ఇచ్చే ధైర్యంతోనే అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా సరిగ్గా ఇదే మ్యాజిక్ చేస్తోంది.
పెద్ది సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ పెద్ది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా సృష్టిస్తున్న మేనియా ఏ రేంజ్ లో ఉందంటే.. ఇంకా ట్రైలర్ కూడా బయటకు రాకముందే నార్త్ అమెరికాలో రికార్డుల వేట మొదలైపోయింది. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం నాలుగు గంటల్లోనే 100K మార్కును దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో, అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకోవడం ఒక్క రామ్ చరణ్‌కే చెల్లింది. మెగా పవర్ స్టార్ గ్లోబల్ ఇమేజ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టించబోతుందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం. మెగా అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న జూన్ 3వ తేదీ రానే వస్తోంది. ఆ రోజు ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ప్రీమియర్లతో పెద్ది జాతర మొదలుకానుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ రా అండ్ రస్టిక్ లుక్స్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన పాటలు, విజువల్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అదేవిధంగా త్వరలో రాబోయే థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, అభిమానులను ఊర్రూతలూగించేలా బుచ్చిబాబు.. ప్రతి సీన్‌ను చెక్కినట్లు తెలుస్తోంది. పెద్ది ఒక ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అని, ఎక్కడా తగ్గకుండా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రం ఉండబోతోందని సినిమా యూనిట్ చెప్పుకొస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా పెద్ది మేనియా ఇప్పుడిప్పుడే మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి, సరికొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేయడానికి గ్లోబల్ స్టార్ సిద్ధమైపోయాడు. మరి ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.