భార్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. భలే క్యూట్ గా ఉన్నారే
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:06 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల (Anna Konidela) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదిలోనే ఆమె సోషల్ మీడియాకు పరిచయమయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల (Anna Konidela) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదిలోనే ఆమె సోషల్ మీడియాకు పరిచయమయ్యారు. నిత్యం ఆమె తనకు సంబంధించిన ప్రతి పనిని.. అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో మీ గడిపిన ప్రతి క్షణాన్ని పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా అన్నా.. తన భర్త పవన్ కళ్యాణ్ తో.. అత్తమ్మ అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఎంతో మంచి ఉదయం.. ఫ్యామిలీతో టైమ్ గడుపుతున్నాను అంటూ క్యాప్షన్ రాశారు.
పవన్ తో ఆమె దిగిన సెల్ఫీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో పవన్ లుక్ చాలా బావుంది. ఈ ఫోటోకి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. నెస్ కపుల్.. భలే క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అన్నా.. రామ్ చరణ్ పెద్ది మూవీకి బెస్ట్ విషెస్ తెలిపారు. పవన్ సైతం చరణ్ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది జూన్ 4 న రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి వీరందరి ఆశీస్సులతో పెద్ది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.