పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత..
ABN , Publish Date - Jul 08 , 2026 | 08:58 AM
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్(Niranjan) మరణం ఇటు జనసైనికుల్లో, అటు మెగా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్(Niranjan) మరణం ఇటు జనసైనికుల్లో, అటు మెగా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా కన్నుమూశాడు. చిన్నప్పటి నుంచి జెనెటిక్ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ .. తన చివరికోరిక తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని కలవడమే అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చిన్నారి అభిమాని కోరికను తీర్చడానికి స్వయంగా జనసేనానినే నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ సంభాషణ, పవన్ చూపించిన ఆప్యాయత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ అభిమాని ఇక లేడనే వార్త అందరినీ కలచివేస్తోంది.
గత నెల నిరంజన్‌ను పరామర్శించిన సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ సీక్వెల్ ఓజీ 2 లో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అంటూ పవన్ స్వయంగా ప్రామిస్ చేశారు. సినిమా సెట్స్‌కి నిరంజన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని చెప్పారు. అంతేకాదు, ఆ పరామర్శ సమయంలో తనకు ఒక కుక్కపిల్ల కావాలని నిరంజన్ చిన్న కోరిక కోరగా.. పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే రోజున ఒక ముద్దులొలికే కుక్కపిల్లను తెప్పించి నిరంజన్ చేతుల్లో పెట్టి ఆ చిన్నారి ముఖంలో ఆనందాన్ని చూశారు.
ఇక ఆ హామీలు, ఆ జ్ఞాపకాలు అలాగే మిగిలిపోగా నిరంజన్ ఇలా అకాల మరణం చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ప్రాణపదంగా ప్రేమించే హీరో సినిమా సెట్స్‌కి వెళ్లి, ఆయన పక్కన కూర్చుని ఓజీ 2 షూటింగ్ చూడాలనే నిరంజన్ కల నెరవేరకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. నిరంజన్ మృతి పట్ల జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.