Pawan Kalyan: వరంగల్ భద్రకాళీ ఆలయంలో.. పవన్ కల్యాణ్ సతీమణి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:15 PM
పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజనోవా ప్రఖ్యాత భద్రకాళీ దేవాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు.
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నాలెజనోవా (Anna Lezhneva) వారి కుటుంబ సభ్యులు మంగళవారం వరంగల్ (Warangal) లోని ప్రఖ్యాత భద్రకాళీ (Sri Bhadrakali Temple) దేవాలయాన్ని దర్శించి అమ్మవారి చెంత పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ స్నపన మండపంలో అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మ మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా పవన్ కల్యాణ్ సతీమణి రాకతో ఆమెను చూసేందుకు మెగా అభిమానులు, స్థానికులు ఎగబడ్డారు.