Pawan Kalyan: పవన్‌కు జరిగిన సర్జరీ అదేనా.. అన్నాలెజినోవా పోస్ట్ వైరల్..
ABN , Publish Date - Apr 19 , 2026 | 10:06 AM
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (AP Deputy Cm Pawan Kalyan) అస్వస్థతకు గురి కావడంతో శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది.
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (AP Deputy Cm Pawan Kalyan) అస్వస్థతకు గురి కావడంతో శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్ర చికిత్స (Pawan Kalyan Surgery) చేశారు. అయితే ఆయనకు జరిగిన సర్జరీ ఏంటనేది అంశంపై చర్చ నడుస్తోంది. కొన్నాళ్లుగా సైనసైటిస్ కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ముక్కుకు ఆపరేషన్ చేసినట్లు తెలిసింది.

ఇప్పుడు శ్వాసకు సంబంధించిన సమస్య తొలగినట్లు సమాచారం. వారంపాటు విశ్రాంతి తీసుకున్నాక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. ఆయన త్వరలో కోలుకుని యధావిధిగా ప్రజా సేవల్లో పాల్గొవాలని ఆంజనేయస్వామిని కోరుకుంటున్నట్లు పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్క్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. దీనికి పవన్ భార్య అన్నాలెజినోవా స్పందిస్తూ.. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆల్ ఈజ్ వెల్.. థ్యాంక్యూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. అలాగే హీరో సాయిధరమ్ తేజ్ కూడా తన మావయ్య పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేశారు.