అబ్బాయ్ కోసం దిగుతున్న బాబాయ్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండమ్మా

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:44 PM

ఇంకో మూడు రోజుల్లో పెద్ది (Peddi) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది.

Peddi

ఇంకో మూడు రోజుల్లో పెద్ది (Peddi) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం పెద్ది (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


రిలీజ్ డేగ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చిత్రబృందం విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ లో ఊత్సాహం మరింత రెట్టింపు అయ్యింది.


ప్రస్తుతం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ వేడుకకు అంతా సిద్ధం చేస్తున్నారు. అబ్బాయ్ కోసం బాబాయ్ కూడా రంగంలోకి దిగడంతో.. వారిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడడానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. దానికి మించి ప్రమోషన్స్ సైతం ఒక్కడే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు చరణ్ కి తోడుగా పవన్ నిలబడ్డారు. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ చేకూరుతోంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jun 01 , 2026 | 03:58 PM