ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌: మాటలతో థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:19 PM

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat singh) చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎటువంటి కట్స్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ (U/A Certificate) పొందిందని మేకర్స్‌ తెలిపారు. 'గబ్బర్‌సింగ్‌' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పవన్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రమిది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఇందులో పవన్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ భగత్‌సింగ్‌గా కనిపించనున్నారు. ఇటీవల పవన్‌ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 29 నిమిషాలనీ, సినిమాలో మాటలు థియేటర్‌ దద్దరిల్లిపోయేలా ఉన్నాయని సెన్సార్‌ టాక్‌.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్‌, హీరో స్టిల్స్‌, పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం విందు భోజనంలా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి పాటలకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా, నేపథ్య సంగీతం తమన్‌ అందించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Updated Date - Mar 10 , 2026 | 03:54 PM