Pawan Kalyan: సినిమా ప్లాప్ అయినా డబ్బులు వస్తాయి.. అది నా కెపాసిటీ
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:28 PM
రాజకీయం నేను బాధ్యత అనుకొని వచ్చాను. డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
Pawan Kalyan: రాజకీయం నేను బాధ్యత అనుకొని వచ్చాను. డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తాజాగా ఆయన పీఠాపురంలో జరుగుతున్న సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పవన్ కూడా డ్యాన్స్ లు వేసి అలరించారు. అనంతరం సంక్రాంతి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోకి తాను డబ్బు సంపాదించడానికి రాలేదని, అది తన బాధ్యత అనుకోని వచ్చినట్లు పవన్ చెప్పారు. సినిమాల్లో తాను బిగ్ యాక్టర్ అని.. అక్కడే ఎక్కువ డబ్బు వస్తుందని తెలిపారు. ' పుష్కర కాలం దాటింది నేను ఇండస్ట్రీకి వచ్చి.. 14 ఏళ్లు.. ఎవరు తీసుకున్నారు. డబ్బు సంపాదన నాకు తెలుసు. నేను బిగ్ యాక్టర్ ని సినిమాల్లో నేను నెంబర్ 1 యాక్టర్ ని కాకపోవచ్చు కానీ, నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే నటున్ని. సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది. అది మీ అందరి అభిమానం, ప్రేమ వలన. ఆలాంటి నేను రాజకీయాల్లోకి ఎందుకు రావాలి. పాలిటిక్స్ నా ఆవేదన, బాధ్యత' అని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.