పవన్ కళ్యాణ్: నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:23 AM

‘నాకు సినిమా అంటే  ఇష్టం. నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకు సేవ చేసే వైపునకు తీసుకెళ్లింది సినిమానే. అందుకే నా దర్శక, నిర్మాతలు అందరూ బాగుండాలని కోరుకుంటా

'నాకు ఏ హీరో సక్సెస్‌ పట్ల ఇన్‌సెక్యూరిటీ ఉండదు. అందరు సినిమాలు బాగా ఆడాలనుకుంటాను. ఫాన్స్ వార్, సోషల్‌ మీడియాలో అబ్యూస్‌ చేసుకోవద్దు. నాకు అందరి హీరోల అభిమానులు ఒక్కటే. ఏ హీరోతో నాకు ఇష్యూస్‌ ఉండవు’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు.    

పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘నాకు సినిమా అంటే  ఇష్టం. నాకు అన్నం పెట్టింది సినిమా.. ప్రజలకు సేవ చేసే వైపునకు తీసుకెళ్లింది సినిమానే. అందుకే నా దర్శక, నిర్మాతలు అందరూ బాగుండాలని కోరుకుంటా. నేను ఏ సినిమాను భాషలతో విడగొట్టి చూడను. ఇండియన్‌ సినిమాగానే చూస్తాను. ఏ సినిమా అయినా బాగా రావాలని, సక్సెస్‌ కావాలనే చేస్తాం. ఈ జర్నీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకెళ్తాం. అన్నింటినీ తట్టుకుని మంచి సినిమా చేసి సక్సెస్‌ చేయడం చాలా కష్టం. నేను దర్శకుడిని నమ్మితే అలా ముందుకెళ్లిపోతుంటా. దర్శకుడు ఏది అడిగితే అది చేసేస్తా. సినిమా మొదలుపెట్టాక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కథ మారింది. రాజకీయాల్లోకి వెళ్లడం.. కరోనా వల్ల  సినిమా ఆలస్యమైంది. మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టాక మైత్రీ నిర్మాతలు, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ చేసిన ప్లానింగ్‌తో నాలో చాలా భరోసా, దైర్యం పెరిగాయి. ఉపముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తూనే సినిమాలు చేయవచ్చనే ధైర్యం పెరిగింది. ఉదయం, సాయంత్రం కలిపి నాలుగైదు గంటలు పని చేసి 48 రోజులు సినిమా పూర్తి చేశాం. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పర్ఫార్మర్. ఆమె  కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. రాశి ఖన్నా నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటి నుంచో చెప్పేవారు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుందని ఆశిస్తున్నాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్.     

పూల మాలలా సిద్ధం చేశాడు హరీశ్‌

పవన్‌కల్యాణ్‌ చేసే సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలి.. ఆర్ట్‌ సినిమాలా ఉండకూడదు.. ఉత్సాహం ఉండాలి.. దేశభక్తి పెంచేలా ఉండాలి. సామాజిక స్పృహ ఉండాలి.. ఇవన్నీ కలిపి భగవంతుడికి వేసే పూలమాలల గుచ్చాడు హరీశ్‌ శంకర్‌ ప్రేక్షకుల మెడలో వేయడానికి సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసం మా వైపు ఎలాంటి పొరపాటు లేకుండా తీశాం. ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. నా నెక్ట్స్‌ సినిమా కోసం ఎవరైనా దర్శకుడు వస్త్తే హరీష్‌, మైత్రీ వారిని కలిసి తక్కువ రోజుల్లో ఈ సినిమా ఎలా పూర్తి చేయాలో తెలుసుకోమని పంపిస్తాను. అభిమానులు లేకపోతే నేనులేను. నేను లో పీరియడ్‌లో ఉన్న సమయంలో భీమ్లానాయక్‌ సినిమాకు అభిమానులు చేసిన సపోర్ట్‌ మరువలేను. మీకు నాకు రెండు గుండెల దూరం. ఎల్లప్పుడూ అభిమానులను ప్రేమిస్తూనే ఉంటా’.

అన్నయ్య పక్కన ఉంటే హీరోనని మరిచిపోతా..

నా వరకూ హీరో అంటే చిరంజీవి. ఈ సినిమా  ఈ వేడుకకు అన్నయ్యగారిని పిలుద్దాం అన్నారు. మీకు హీరో కావాలంటే నన్ను పిలవండి.. తమ్ముడు కావాలంటే అన్నయ్యను పిలవండి అని చెప్పాను. చిరంజీవిగారు వేదిక మీదుంటే నేను తమ్ముడిగానే ఉంటా. హీరోనని మరిచిపోతానన్నాను. ట్రైలర్‌ చూసి ప్రశంసించిన అన్నయ్యకు, చరణ్‌కు థ్యాంక్స్‌. ఇక సినిమా టిక్కెట్‌ పెంపు అనేది నా సినిమాల కంటే మిగతా హీరోల సినిమాలకే రేటు ఎక్కువ ఇస్తాను. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్‌ పడకూడదు అన్నప్పటికీ కాంతారకు టికెట్‌ ధరలు పెంచాం. అయితే నిర్మాతలు ఎంత ఖర్చుపెడతారో, ఎంతగా కష్టపడతారో తెలుసు కాబట్టి ుదేహి అని అడగకండి’ అని వారిని కోరతాను.




 


Updated Date - Mar 16 , 2026 | 12:30 AM