Panjaa: పవన్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రీ రిలీజ్‌కు రెడీ..
ABN , Publish Date - May 24 , 2026 | 05:24 PM
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా చిత్రం రీ రిలీజ్ కానుంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నటించిన మోస్ట్ స్టైలిష్ చిత్రాల్లో ‘పంజా’ (Panja) ఒకటి. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్, సంఘమిత్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 9, 2011లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న తరుణంలో ఈ చిత్రాన్ని డిజిటలైజ్ చేసి మళ్లీ విడుదల చేయనున్నారు మేకర్స్. సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఆవిష్కరించారు. ‘జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌గారు నటించిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పంజా’ సినిమా రీ-రిలీజ్ పోస్టర్‌ను రాజమహేంద్రవరంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన పవన్‌కల్యాణ్‌గారి పుట్టినరోజును పురస్కరించుకుని మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. రీ రిలీజ్‌లోనే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.
పవన్‌కల్యాణ్ సరసన సారా జేన్ డయాస్, అంజలి లవానియా నటించిన ఈ చిత్రాని నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించారు.