పవన్‌తోనా.. నానీతోనా.. సుజిత్ రూటేంటి!

ABN , Publish Date - Jul 03 , 2026 | 08:13 PM

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ తదుపరి సినిమా గురించి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉంటుందా..? లేక నేచురల్ స్టార్ నానితో ఉంటుందా..?

Sujeeth Next Film Update

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ (Director Sujeeth) తదుపరి సినిమా గురించి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan)తో సినిమా ఉంటుందా..? లేక నేచురల్ స్టార్ నాని (Natural Star Nani)తో ఉంటుందా..? అసలు సుజిత్ దారెటు? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘రన్ రాజా రన్’ వంటి కలర్ ఫుల్ బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. తొలి సినిమాతోనే తన టేకింగ్ ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ యువ దర్శకుడు, ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా విజువల్‌గా, స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా అదరగొట్టినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫలితంతో సుజిత్‌కు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.


సరిగ్గా ఆ గడ్డు కాలంలోనే నేచురల్ స్టార్ నానితో ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. కానీ నాని తన వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లోనే సుజిత్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ (OG) సినిమా చేసే బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి, పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు సుజిత్. ‘ఓజీ’ సక్సెస్‌తో సుజిత్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. సుజిత్‌కు వచ్చిన ఈ క్రేజ్ చూసి, నాని క్యాంప్ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. వెంటనే ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే క్రేజీ టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్‌గా జరిగాయి. దీనికి సంబంధించిన ప్రీ గ్లింప్స్‌ కూడా అదరిపోయే రేంజ్‌లో వచ్చింది. ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న టైమ్‌లోనే కథ మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ నుంచి సుజిత్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. ఈసారి ఏకంగా ‘ఓజీ 2’ (OG2) కోసం. దీంతో సుజిత్ తన ఫోకస్ మొత్తం ‘ఓజీ 2’ వైపు షిఫ్ట్ చేశాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.


ఈ తాజా పరిణామాలతో నాని ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు నాని అభిమానులు మాత్రం సుజిత్ దర్శకత్వంలో తమ హీరోను నెవర్ బిఫోర్ యాంగిల్‌లో చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే పరిస్థితులు వేరేలా ఉన్నాయి. నాని ప్రస్తుతం ‘ద ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కావడానికి కనీసం మరో రెండు మూడు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్‌లో సుజిత్ ఖాళీగా లేడు. ‘ఓజీ 2’కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సైలెంట్‌గా మొదలయ్యాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ వెంటనే మొదలవుతుందా? లేక చాలా టైం పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు చూస్తే నాని ‘ద ప్యారడైజ్’ డిసెంబర్ కల్లా పూర్తయి రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇప్పట్లో దొరకకపోతే, సుజిత్ మళ్లీ తన ట్రాక్ మార్చి ముందుగా నాని సినిమాను పూర్తి చేస్తాడా..? లేక పవన్ కోసమే వెయిట్ చేస్తాడా..? పవన్ ముందా.. నాని ముందా.. సుజిత్ వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇవి కూడా చదవండి:

ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!

72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?

Updated Date - Jul 03 , 2026 | 08:13 PM