పవన్‌కల్యాణ్‌: తదుపరి చిత్రంపై నిర్మాణ సంస్థ క్లారిటీ.. ఇప్పట్లో లేనట్లే..

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:13 AM

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం పై వస్తున్న వార్తలపై పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్క్‌ నిర్మాణ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

గతేడాది ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలతో అలరించారు పవన్‌కల్యాణ్‌. ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పుడో కమిట్‌ అయిన ఈ మూడు చిత్రాలను పూర్తి చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటున్నారు. అయితే అభిమానులు మాత్రం సినిమా విషయంలో వాట్‌ నెక్ట్స్‌ అంటూ చర్చలు మొదలెట్టారు. తదుపరి సినిమాపై వస్తున్న రూమర్లను పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్క్‌ నిర్మాణ స్పందించి క్లారిటీ ఇచ్చింది. సామాజిక అంశాల మీదే సినిమాలు తీసే దర్శకుడు దేవకట్టాతో ఓ సినిమా చేయబోతున్నారని వస్తోన్న వార్తల నేపథ్యంలో నిర్మాణ సంస్థ స్పందించినట్లు తెలుస్తోంది.

‘ప్రస్తుతానికైతే పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. ఆయన తదుపరి చిత్రాలపై వస్తున్న రూమర్స్‌ నిజం కాదు. ఇటీవల ఆయన నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రిలీజ్‌ అయింది. వెంటనే కొత్త ప్రాజెక్ట్‌ చేయాలన్న ప్లాన్స్‌ ఏమీ లేవు. ఒకవేళ ఆయన ఏదైనా సినిమాకు సైన్‌ చేస్తే అధికారిక సోషల్‌ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తాం. ఓజీ-2 గురించి ఓ మంచి సమయంలో కల్యాణ్‌గారే చెబుతారు’ అని పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎప్పుడో కమిట్‌ అయిన సినిమా కూడా ఇప్పట్లో లేనట్లే తెలుస్తోంది.  

Updated Date - Mar 24 , 2026 | 10:35 AM