ఎప్పుడు లేనిది.. పవన్ ఉస్తాద్ కోసం ఆ పని చేశారా
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:33 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh).
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తరువాత పవన్ - హరీష్.. ఉస్తాద్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మార్చి 19 న ఉస్తాద్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ మధ్యనే ట్రైలర్ టీజ్ ని రిలీజ్ చేశారు. ఇందులో పవన్ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఇక ఉస్తాద్ కోసం పవన్ మునుపెన్నడూ లేనివిధంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఆయన ప్రతి సినిమాకు ఒక్కరోజులోనే డబ్బింగ్ చెప్పేస్తారు. కానీ, ఉస్తాద్ కి మాత్రం రెండు రోజులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భారీ డైలాగ్స్ ఉండడంతో నెమ్మదిగా టైమ్ తీసుకొని ప్రతి డైలాగ్ ను ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారట. ఈ విషయం తెలియడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఉస్తాద్.. తమిళ్ సినిమా తేరికి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే హరీష్ మాత్రం.. కేవలం సినిమా లైన్ మాత్రమే తీసుకొని మిగతా కథ. మొత్తం మార్చినట్లు తెలిపారు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమాతో పవన్ - హరీష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.