త్రిషపై కామెంట్స్.. స్పందించిన పార్తిబన్
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:33 PM
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ త్రిషపై (Trisha) నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ (R Parthiban) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ త్రిషపై (Trisha) నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ (R.Parthiban) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష పరోక్షంగా స్పందించడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ అయింది. తాజాగా దీనిపై పార్తిబన్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. 'నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో నేను పశ్చాత్తాపం పడటం తప్ప మరో మార్గం లేదు' అని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
కొంత కాలంగా త్రిషపై కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో త్రిషపై దర్శకుడు పార్తిబన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొన్ని రోజులు ఈ కుందవై (పొన్నియిన్ సెల్వన్ లో త్రిష పోషించిన పాత్ర పేరు) ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు రావడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రతి విషయాన్ని బహిరంగంగా చెప్పలేము. కొన్ని సందర్భాల్లో కవితలను బయటకు చెప్పడం కన్నా మనలో మనమే నిశ్శబ్దంగా ఆస్వాదించడం మంచిది’ అని వ్యాఖ్యానించారు.

దీనికి త్రిష కూడా కౌంటర్ ఇచ్చారు. 'చేతిలో మైక్ ఉందని మాట్లాడే ప్రతి మాట తెలివైనదిగా ఉండదు. దాని వల్ల హాస్యం పండదు. అది కేవలం మూర్ఖత్వం అవుతుంది. అవగాహన లేకుండా మాట్లాడే ప్రతి మాట అవి ఎవరిని ఉద్దేశించి చెప్పారన్నదానికంటే మాట్లాడిన వ్యక్తి గురించి ఎక్కువగా చెబుతాయి' అని పరోక్షంగా పోస్ట్ పెట్టారు. దీనితో పార్తిబన్ స్పందించారు.