Vaaranaasi: బిహైండ్ ది సీన్స్‌కి డబ్బులా.. ఇదెక్కడి ట్విస్ట్ రా మావా
ABN , Publish Date - May 06 , 2026 | 07:46 PM
డబ్బులు పెట్టి సినిమాలు ప్రమోట్ చేసుకోవడం అందరి స్టైల్. కానీ ప్రమోషన్ కోసం పైసా ఖర్చు పెట్టకపోగా రివర్స్‌లో ఆదాయం వచ్చేలా చేసుకోవడం జక్కన్న స్టైల్.
Vaaranaasi: డబ్బులు పెట్టి సినిమాలు ప్రమోట్ చేసుకోవడం అందరి స్టైల్. కానీ ప్రమోషన్ కోసం పైసా ఖర్చు పెట్టకపోగా రివర్స్‌లో ఆదాయం వచ్చేలా చేసుకోవడం జక్కన్న స్టైల్. సూపర్ స్టార్ మూవీ కోసం ఆయన వేస్తున్న ప్లాన్ చూస్తే మతిపోయేలా ఉంది. గ్లోబల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీల్లో 'వారణాసి (Vaaranaasi)' ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ అడ్వెంచరస్ డ్రామా షూటింగ్ కీలక దశలో ఉంది. కానీ రిలీజ్‌కు ముందే ఒక టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వారణాసి సినిమా ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ వీడియోలు, తెర వెనుక దృశ్యాలను 'వారణాసి బిటిఎస్' పేరుతో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇదేమి ఫ్రీగా చూసేది కాదు. దానికి డబ్బులు చెల్లించాలి. ఏంటి, నిజమా.. అంటే. అవును ఇప్పుడే ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. వారణాసి బిటిఎస్ కోసం జక్కన్న సబ్‌స్క్రిప్షన్ మోడల్ ని తీసుకురానున్నాడట. ఈ కంటెంట్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజుగా రూ. 199 రూపాయలు చెల్లించాలని తెలుస్తోంది. సాధారణంగా సినిమా హైప్ పెంచడానికి ఉచితంగా విడుదల చేసే మేకింగ్ వీడియోలకు కూడా డబ్బులు అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
రాజమౌళి ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. సినిమా తీయడం మాత్రమే కాదు, మార్కెటింగ్‌లో కూడా వినూత్న ప్రయోగాలు చేస్తారు. అయితే ఈ వార్త నిజమైతే ప్రేక్షకుల నుంచి తీవ్ర నెగెటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్న తరుణంలో... కేవలం షూటింగ్ వీడియోలు చూడటానికి కూడా రూ. 199 రూపాయలు అడగడం సరైనదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్, సెటైర్లు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్త నిజమా? లేక కేవలం పుకారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే ఈ బిటిఎస్ వీడియోలను ఓటీటీలో రిలీజ్ చేస్తారా.. లేక యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా.. ఏ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.