రాకాలో విల్ స్మిత్.. అదిరా ఐకాన్ స్టార్ రేంజ్
ABN , Publish Date - Aug 19 , 2026 | 09:20 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun),అగ్ర దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సైన్స్-ఫిక్షన్ యాక్షన్ ఎపిక్ రాకా (Raaka).
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun),అగ్ర దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సైన్స్-ఫిక్షన్ యాక్షన్ ఎపిక్ రాకా (Raaka). సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అందాల భామలు దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ నటిస్తోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త మొత్తం ఇండస్ట్రీనే కుదిపేస్తోంది.
తాజాగా అందుతున్న సంచారం ప్రకారం ఈ భారీ పాన్-వరల్డ్ చిత్రంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ని ప్రధాన ప్రతినాయకుడి (విలన్) పాత్రలో నటించేందుకు చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విల్ స్మిత్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడితే, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన, బిగ్గెస్ట్ హాలీవుడ్-ఇండియన్ కాంబినేషన్‌గా నిలవనుంది. విల్ స్మిత్‌కు సంబంధించిన సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆయన ఇచ్చే డేట్స్ ని బట్టి సెప్టెంబర్ తర్వాత ఈ విదేశీ షెడ్యూల్‌ను నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోందని టాక్. ఇప్పటికే విల్ స్మిత్ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం.
త్వరలోనే మేకర్స్ ఈ విదేశీ చిత్రీకరణకు సంబంధించి లొకేషన్లను ఫైనల్ చేయనున్నారట. ఈ విషయం తెలియడంతో అదిరా ఐకాన్ స్టార్ రేంజ్.. హాలీవుడ్ హీరోలను టాలీవుడ్ కి పరిచయం చేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్, అట్లీ విజన్, దానికి తోడు విల్ స్మిత్ లాంటి గ్లోబల్ స్టార్ విలన్‌గా నటిస్తుండటంతో రాకా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయమై ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.