Posani Krishna Murali: ఈ సినిమాకు.. రాజకీయాలతో సంబంధం లేదు
ABN , Publish Date - May 08 , 2026 | 05:48 AM
పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’.
‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి లీడ్‌రోల్‌లో నటిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అని అనుకుంటారు. కొందరి కుట్ర, రాజకీయాలకు ఓ జర్నలిస్టు బలి అయితే సీఎం ఎలా అదుకున్నాడనేది చూపించాం.
సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్‌రావు నటించారు. ఈ సినిమాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్‌గా చేసిన సినిమా ఇది. ఇండియాలోనే గొప్ప స్క్రీన్‌ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను’ అని అన్నారు రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali).
ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ (Operation Aruna Reddy). గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలను వివరించారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ ‘పోసాని ఈ కథను చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ ఒక పవర్‌ఫుల్ ఉమెన్. ఆమెలాంటి అమ్మాయిలు నేటి సమాజానికి ఎంతో అవసరం’ అని అన్నారు.