Chandrahass: నటుడు చంద్రహాస్‌పై మ‌రో కేసు

ABN , Publish Date - Feb 06 , 2026 | 09:49 AM

ఓ ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పాటలు పాడిన బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడు చంద్రహాస్‌పై మ‌రో కేసు నమోదైంది.

ఓ ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పాటలు పాడిన బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 1న జూబ్లీహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన 'బరాబర్ ప్రేమిస్తా' (Barabar Premistha) ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కు హాజరైన చంద్రహాస్‌ అసభ్యకరమైన పాటలు పాడారు.

ఈ పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. పాటలు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కానిస్టేబుల్‌ నితీష్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 02:35 PM