నాని 'ది ప్యార‌డైజ్'.. ఆయా షేర్ ప్రోమో

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:21 PM

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్టాల ప్ర‌జ‌లంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం ది ప్యార‌డైజ్.

nani

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్టాల ప్ర‌జ‌లంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం ద ప్యార‌డైజ్ (The Paradise). స‌రిపోదా శ‌నివారం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం త‌ర్వాత నాచుర‌ల్ స్టార్‌ నాని (Nani) న‌టించిన ఈ చిత్రంపై అంచ‌నాల‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా ఉన్నాయి. ద‌స‌రా వంటి సూప‌ర్ స‌క్సెస్ త‌ర్వాత శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ మూవీని రూపొందిస్తుండ‌డంతో ఈ ప్యార‌డైజ్ సినిమా త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఆయా షేర్ (Aaya Sher) కు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేసింది. పూర్తి పాట‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పాట‌ను కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఆధ్వ‌ర్యంలో వంద‌లమంది డ్యాన్స‌ర్ల న‌డుమ నాని, సంపూర్ణేశ్ బాబు త‌దిత‌ర న‌టుల‌పై భారీ సెట్‌లో చిత్రీక‌రించారు. రాక్‌స్టార్ అనిరుధ్ (Anirudh Ravichander) ఈ పాట‌కు ఎలక్ట్రిఫైయింగ్ మాస్ ట్యూన్ అందిచంగా ఫుల్ జోష్‌లో సాంగ్ సాగింది.

Updated Date - Feb 23 , 2026 | 12:33 PM