అయ్యో.. అనుకున్నంతా అయింది! ప్రభాస్ ఫ్యాన్స్.. బాధ వర్ణనాతీతం
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:54 PM
రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేల్చుతూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు దాటినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. డిసెంబర్ 3న సినిమాను విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం మరో 30 నుంచి 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం వస్తోంది.
దీనికి తోడు వీఎఫ్‌ఎక్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా భారీగా పెండింగ్‌లో ఉండటంతో ఈ టార్గెట్ కూడా అందుకోవడం కష్టమేనని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి స్థాయిలో చిత్రీకరణ ముగిశాక మాత్రమే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.