ఎన్టీఆర్ న్యూ అవతార్.. కుమార స్వామి దివ్యమైన ఆహార్యం ఉట్టిపడేలా లుక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్
ABN , Publish Date - Aug 25 , 2026 | 03:34 PM
మోచేతికి జరిగిన సర్జరీ కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ రెస్ట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, క్షణం ఖాళీగా ఉండకుండా కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు.
మోచేతికి జరిగిన సర్జరీ కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం ఫుల్ రెస్ట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, ఆయన మాత్రం క్షణం కూడా ఖాళీగా ఉండకుండా కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు. సర్జరీ అయ్యే ముందు వరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న గ్రాండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన డ్రాగన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. అయితే, ఇప్పుడు అంతకంటే ఆసక్తికరమైన క్రేజీ విషయం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా గురించే.
ఇప్పటివరకు తారక్ చేసిన సినిమాలన్నీ మాస్, యాక్షన్ ఓరియెంటెడ్‌గానే సాగాయి. అయితే సరిగ్గా ఇరైయ్యేళ్ల కిందట వచ్చిన యమదొంగ చిత్రంలో యంగ్ యముడిగా అదరగొట్టిన ఆయన, ఇప్పుడు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ (God of War) సినిమాలో ఏకంగా కుమార స్వామి పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు సినీ వర్గాలలో సంచలనంగా మారింది. ఈ పాత్ర కోసం కుమార స్వామి దివ్యమైన ఆహార్యం ఉట్టిపడేలా త్రివిక్రమ్ టీమ్ ప్రత్యేకమైన లుక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌ను సిద్ధం చేయిస్తోంది.
అంతేకాకుండా కథ విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా మరింత మెరుగైన మార్పులు కూడా చేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకీ మరియు శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో ఆదర్శకుటుంబం అనే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో వచ్చిన గుంటూరు కారం సినిమాపై వచ్చిన విమర్శలన్నింటికీ ఈ చిత్రంతో త్రివిక్రమ్ గట్టి సమాధానం ఇవ్వబోతున్నారని సమాచారం.
ఈ ఆదర్శకుటుంబం సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టనున్నారు. ఈ లోపు ఎన్టీఆర్ కూడా పూర్తిగా కోలుకుని డ్రాగన్ షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశాలున్నాయి. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇప్పటికే గాడ్ ఆఫ్ వార్, దేవసేనాపతి అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సెట్స్‌పైకి వెళ్లే సమయానికి వీటిలో ఒకదానిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!