NTR: డ్రాగన్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ మొదలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:59 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్ (Dragon)’.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్ (Dragon)’. కన్నడ భామ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ (Anil Kapoor) ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించి సినిమాపై అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక కళ్లు చెదిరే భారీ సెట్‌ను నిర్మించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ భారీ సెట్‌లో దాదాపు పదిహేను రోజుల పాటు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ ‘ఓల్డ్ లుక్’ క్యారెక్టర్‌కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేయబోతున్నారట. ఈ పవర్‌ఫుల్ ఫైట్ సీక్వెన్స్‌లను ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ కంపోజ్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ఆయన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకమైన కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ పోరాట దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లతో పాటు ఎన్టీఆర్ ఎనర్జీ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ పార్ట్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్.
ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్‌గా రావాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ వర్క్ కోసమే ఆయన చాలా కాలం కేటాయించారని తెలుస్తోంది. ఫలితంగా, ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ రూపొందించిన సినిమాలన్నింటికంటే ‘డ్రాగన్’ ఒక మాస్టర్ పీస్‌గా ఉంటుందని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ బాణీలు అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. కథా విస్తృతి చాలా ఎక్కువగా ఉండటంతో, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, రెండు పార్టులకు సంబంధించిన షూటింగ్‌ను దాదాపు ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. దీనివల్ల మొదటి భాగం విడుదలైన కొద్ది కాలానికే రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.