Jr Ntr: ఎన్టీఆర్‌-నీల్‌..డ్యూయల్‌ పార్ట్స్‌..డ్యూయల్‌ లుక్స్‌..

ABN , Publish Date - May 03 , 2026 | 09:50 AM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ గురించి రోజుకో అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ గురించి రోజుకో అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఈ నెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ గ్లింప్స్‌ను (Dragon)రిలీజ్‌ చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ మేనరిజమ్స్ తో ఆ లుక్ ఎలా ఉండబోతోందో అని సోషల్ మీడియా అంతా చర్చించుకుంటోంది.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తుంది. దురంధర్ సిరీస్ సాధించిన భారీ విజయం, ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ప్రశాంత్ నీల్ ఈ కథను రెండు భాగాలుగా మలిచారు. అవును, ఒకేసారి రెండు పార్ట్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. కథలోని లోతు, పాత్రల పరిధి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల టాక్. ప్రశాంత్ నీల్ హీరోల మేకోవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న రూపాల్లో కన్పించబోతున్నారు. మొదటి భాగంలో చాలా లీన్ గా, పదునైన లుక్ లో తారక్ కనిపిస్తే.. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కండలు తిరిగిన బీస్ట్ అవతారంలో మాస్ ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఈ డ్యూయల్ మేకోవర్ కోసమే ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. సినిమాలో కేవలం యాక్షనే కాదు, అదిరిపోయే ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట. ఈ ప్రత్యేక గీతం కోసం చిత్ర బృందం ఇప్పటికే ఒక బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. రవి బస్రూర్ అందించే ఊర మాస్ మ్యూజిక్ కు తారక్ స్టెప్పులు కిక్‌ ఎలా ఉంటుందో చూడాలి.


ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ట్యూన్స్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ప్రశాంత్‌ నీల్‌ సినిమాలలో హీరో ఎలివేషన్‌ సీన్స్‌కు ఏమాత్రం కొదవ ఉండదన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా ఎవరూ ఊహించని రీతిలో ఈ రేంజ్ ప్రాజెక్ట్ ఉంటుందని ఎన్టీఆర్‌ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 10:34 AM