Jr NTR: హైదరాబాద్ శివార్లలో డ్రాగన్!
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:41 PM
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తాజా చిత్రం 'డ్రాగన్' తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఫారిన్ లో జరుగబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' (Dragon) మూవీ మళ్ళీ లైన్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మిస్తోంది. సినిమా సెట్స్ పై ఉండగా కొన్ని రకాల పుకార్లు షికారు చేయడంతో ప్రాజెక్ట్ కు మధ్యలో బ్రేక్ పడిందనే భావనకు ఇటు ప్రేక్షకులు, అటు ఎన్టీఆర్ అభిమానులు భావించారు. అయితే మొత్తానికి వాటన్నింటినీ షార్ట్ అవుట్ చేసుకుని చిత్ర బృందం షూటింగ్ స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న ఫైటింగ్ సీక్వెన్ ను పూర్తి కాగానే విదేశాలలో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అందుకోసమే ఇటీవల సినిమాటోగ్రాఫర్ భువన గౌడ జోర్డాన్ వెళ్ళి అక్కడ కొన్ని లొకేషన్స్ ను ఫైనలేజ్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా రెండు భాగాలు వస్తుందనే వార్తలు వస్తున్నా... అధికారికంగా మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏదేమైనా... ఈ యేడాదిలోనే 'డ్రాగన్'గా ఎన్టీఆర్ తన అభిమానులను పలకరించనున్నాడు.