NTR: ఆ పని చేసి సినిమాల్లోకి రావాల్సింది..

ABN , Publish Date - Nov 09 , 2026 | 06:12 PM

ఇండస్ట్రీలో ఒక హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే.. అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు అంటే మరిన్ని అంచనాలు ఉంటాయి. ఇలాంటివి ఇప్పుడు చూస్తున్నాం.

NTR

ఇండస్ట్రీలో ఒక హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే.. అభిమానుల్లో చాలా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు అంటే మరిన్ని అంచనాలు ఉంటాయి. ఇలాంటివి ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు ఇన్ని అంచనాలు ఉండేవి కావు. అలాంటి సమయంలోనే నందమూరి తారక రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక అప్పట్లోనే ఆయన లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా బెదరకుండా తారక్.. గట్టిగా నిలబడి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా నిలబడ్డాడు. అయితే ప్రతి నటుడికి కెరీర్‌లో ఏదో ఒక విషయంలో కొంత అసంతృప్తి ఉంటుంది. తాజాగా తారక్ తన అసంతృప్తిని బయటపెట్టాడు.


అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ఇట్లు అర్జున. అక్కినేని నాగార్జున సమర్పిస్తున్న ఈ సినిమా నవంబర్ 13 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా తారక్, అనీష్ ఇంటర్వ్యూ వీడియోని రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తారక్ ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. కెరీర్ లో తాను అసంతృప్తి చెందిన విషయం గురించ చెప్పమంటే..తన విషయంలో అది తన కెరీర్ మొదట్లో తన ఫిజిక్ సంబంధించి ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను కొంచెం బొద్దుగా, లావుగా ఉండేవాడినని, అదొక్కటే లేకుండా ఉంటే బాగుండేదేమోనని అని తెలిపాడు.


'కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా, లావుగా ఉండేవాడ్ని. కొంచెం సన్నగా, ఇంకొంచెం బరువు తగ్గి సినిమాల్లోకి వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది'అంటూ తారక్ తన మనసులోని చిన్న అసంతృప్తిని బయటపెట్టాడు. అయితే ప్రస్తుతం తన ఫిజిక్, ఫిట్‌నెస్ పట్ల తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, కొన్నాళ్లుగా ఫిట్‌నెస్‌ను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. తారక్ తన మొదటి సినిమా నిన్ను చూడాలని దగ్గర నుంచి దాదాపు 10- 12 సినిమాల్లో బొద్దుగా కనిపించాడు. ముఖ్యంగా రాఖీలో అయితే మరింత బొద్దుగా కనిపించాడు. ఆ తరువాత డైరెక్టర్ రాజమౌళి సూచనతో బరువు తగ్గి ఫిర్ నెస్ మీద ఫోకస్ చేశాడు. కంత్రీ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు తారక్ తన ఫిట్ నెస్ ని కొనసాగిస్తున్నాడు.


ఒక సినిమా కోసం బరువు తగ్గాలన్నా.. పెరగాలన్నా తారక్ ఎంత కష్టమైన చేస్తాడు. దేవరలో తండ్రి పాత్రకు బరువు పెరిగి కనిపించిన ఎన్టీఆర్.. కొడుకు పాత్రకు వెంటనే బరువు తగ్గాడు. ఇక డ్రాగన్ కోసం అయితే మరింత చిక్కి కండలు పెంచి కనిపించాడు.ప్రస్తుతం డ్రాగన్ తో బిజీగా ఉన్న తారక్.. దీని తరువాత గాడ్ ఆఫ్ వార్ సినిమా సెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 09 , 2026 | 06:17 PM