NTR Meal Kit: లక్షలాది మందికి అన్నం.. 2,000కిపైగా మీల్ కిట్లు..

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:44 PM

అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్‌ ఈవెంట్స్‌ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది.

అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్‌ ఈవెంట్స్‌ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో సాగిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్న ఎంతోమందికి భోజనం అందించారు. ‘ఎన్టీఆర్ మీల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది ఆకలి తీర్చినట్లు, 2,000కిపైగా మీల్ కిట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్‌ కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఒకే లక్ష్యంతో పనిచేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. 

ఈ సేవా కార్యక్రమం గురించి ఓ అభిమాని సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. “లక్షలాది మందికి ఆహారం, 2,000కిపైగా మీల్ కిట్లు, అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్‌.. ఇదే ‘ఎన్టీఆర్ మీల్’ ప్రభావం” అంటూ ప్రశంసించారు. ఇదే స్థాయిలో మరో టాలీవుడ్‌ హీరో అభిమానులు సేవా కార్యక్రమం నిర్వహించి ఉంటే ఇప్పటికి విస్తృతంగా ప్రశంసలు, గుర్తింపు లభించేవని అభిప్రాయపడ్డారు. ‘ఎన్టీఆర్ మీల్’ చేసిన సేవను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం గురించి పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఇది చేసిన సేవే దాని ప్రభావానికి నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ మీల్’ సేవలు నిలిచిపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో “Hope you’ll be back soon, bro” అంటూ సేవా కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నారు  

Updated Date - Aug 15 , 2026 | 01:00 PM