ఎన్టీఆర్- నెల్సన్ క్రేజీ కాంబినేషన్.. కానీ ఇప్పట్లో కష్టమేనా?
ABN , Publish Date - Jul 06 , 2026 | 08:35 PM
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - నెల్సన్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా సినిమా సెట్ అయిందనే వార్త ఇండస్ట్రీని షేక్ చేసింది.
'జైలర్' లాంటి సూపర్ హిట్ తర్వాత సౌత్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయారు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar). రజనీకాంత్‌కు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన నెల్సన్.. తదుపరి ప్రాజెక్ట్‌లపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) - నెల్సన్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా సినిమా సెట్ అయిందనే వార్త ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒకానొక దశలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం దాదాపు ఖాయమే అనుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఇద్దరి కలయిక వెండితెరపై సాకారం కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.
ఇందుకు కారణం., జూనియర్ ఎన్టీఆర్ డైరీ రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ఖాళీ లేకపోవడమే ప్రస్తుతం 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 'గాడ్ ఆఫ్ వార్' అనే భారీ మైథలాజికల్ విజువల్ ఫాంటసీని ఇప్పటికే లైన్‌లో పెట్టారు. సహజంగానే కమర్షియల్ సినిమాలకే ఎక్కువ సమయం తీసుకునే త్రివిక్రమ్, ఇప్పుడు భారీ గ్రాఫిక్స్, పౌరాణిక బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను హ్యాండిల్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో ఊహించడం కష్టం. ప్రాక్టికల్‌గా చూస్తే, తారక్ ఈ చిత్రం నుండి బయటకు రావడానికి 2029 అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆపై దేవర 2 కూడా ఉంటుందని సదరు నిర్మాత ఇప్పటికే బాహాటంగా ప్రకటించడంతో ఈ చిత్రం ఎనీ టైమ్ పట్టాలెక్కవచ్చు. దీంతో ఈ సినిమాల తర్వాత మాత్రమే ఎన్టీఆర్, నెల్సన్ చిత్రానికి టైమ్ కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదిలాఉంటే.. పేపర్ మీద ఈ క్రేజీ కాంబినేషన్ సజీవంగానే ఉన్నప్పటికీ, రాబోయే రెండు, మూడేండ్లలో ఈ మూవీ కార్యరూపం దాల్చడం ఇంపాజిబుల్. అయితే నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా సెట్ చేయాలని పట్టుదలతో ఉన్నారని టాక్. తమిళ దర్శకులు తెలుగు హీరోల పాన్-ఇండియా మార్కెట్‌పై కన్నేసిన తరుణంలో.. నెల్సన్ మార్క్ 'డార్క్ కామెడీ', విచిత్రమైన క్యారెక్టరైజేషన్లు, స్టైలిష్ ఎలివేషన్లు.. తారక్ లాంటి హై-వోల్టేజ్ మాస్ ఎనర్జీ ఉన్న హీరోతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయనేది పెద్ద సస్పెన్స్. ఏదేమైనా, వినడానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్న ఈ కాంబో థియేటర్లలోకి రావాలంటే అభిమానులు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందే!.