నేను పూర్తిగా.. తెలుగు అమ్మాయిగా మారిపోయా
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:07 PM
నేను పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయానని టాలీవుడ్ అగ్ర హీరోయిన్ మీనాక్షి చౌదరి అన్నారు.
యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో ఓ సిల్క్ సెంటర్‌ను ప్రారంభించిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) షాపింగ్ మాల్ లో జ్యోతి ప్రజ్వల చేసి ప్రత్యేక పూజలు చేశారు. షాపింగ్ మాల్‌లో కలియ తిరిగి ప్రేక్షకులతో సందడి చేశారు. సెల్ఫీలు దిగారు. హీరోయిన్ వసచ్చిన విషయం తెలిసిన సినిమా లవర్స్, అభిమానులు మీనాక్షిని చూసేందుకు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..“నేను పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయాను. నేను భువనగిరికి రావడం ఇదే మొదటి సారి చాలా సంతోషంగా ఉంది. నాకు చీరలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాటన్, సిల్క్, బనారస్ చీరలు అంటే చాలా ఇష్టం” అని మీనాక్షి చౌదరి తెలిపారు..
ఇక తన తాజా చిత్రం ‘వృశకర్మ’ గురించి కూడా ఆమె వివరించారు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. ‘వృశకర్మ’ పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అని, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మరో మూడు, నాలుగు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.