P.Susheela: పురస్కారాలు, పొగడ్తలు, ప్రసంగాలతో.. ఏమీ రాదు

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:18 AM

ఆర్థిక ప్రోత్సాహం లేక సంగీత రంగంలో పేదలుగా మిగిలిపోతున్న వారికి సహాయం చేయలేకపోతున్నానని ప్రఖ్యాత గాయని పి.సుశీల ఆవేదన వ్యక్తం చేశారు.

P.Susheela

వేల గీతాలను ఆలపించిన తనకు ఆర్థిక ప్రోత్సాహం లేక సంగీత రంగంలో పేదలుగా మిగిలిపోతున్న వారికి సహాయం చేయలేకపోతున్నానని ప్రఖ్యాత గాయని పి.సుశీల (P.Susheela) ఆవేదన వ్యక్తం చేశారు. పురస్కారాలు.. ప్రసంగాలు.. పొగడ్తలతో ఏమీ రాదని, ఆర్థిక ప్రోత్సాహం చేస్తే పదిమందికి ఉపయోగపడుతుందని అన్నారు. రవీంద్రభారతి (Ravindra Bharathi) లో మంగళవారం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ (Sruti Laya Arts Academy) ఆధ్వర్యంలో పి.సుశీలకు మహాత్మాగాంధీ స్పూర్తి పురస్కారం (Mahatma Gandhi Inspiration Award) ప్రదానం చేశారు.

ఎమ్మెల్సీ శ్రవణ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దామోదర గుప్తా, రాంనారాయణరెడ్డి తదితరులు హాజరై సుశీలను సత్కరించారు. అనంతరం సుశీల మాట్లాడుతూ.. తనకు ఉన్న దాంట్లో సుశీల ట్రస్టును ప్రారంభించానని, ఆర్థిక లావాదేవీలు లేక ట్రస్టు మూతపడిందన్నారు. ఎమ్మెల్సీ శ్రవణ్ మాట్లాడుతూ భారతీయ సంగీత చరిత్రలో పవిత్రమైన నాద తపస్వి గానకోకిల పి.సుశీల అని అభివర్ణించారు. ఈ సందర్భంగా చక్కటి స్వరాలతో గాయకులు ఓలలాడించారు. కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, జితేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 08:18 AM