Nari Nari Naduma Murari: సినిమా.. క్షణం కూడా బోర్ కొట్టదు
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:41 AM
‘నారీ నారీ నడుమ మురారీ’పండుగ సినిమా. ప్రేక్షకులను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తుతుంది’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు.
‘నారీ నారీ నడుమ మురారీ’ (Nari Nari Naduma Murari) పండుగ సినిమా. ప్రేక్షకులను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తుతుంది’ అని నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) అన్నారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శర్వానంద్ (sharwanand) హీరోగా ఆయన నిర్మించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదలవుతోంది. తాజాగా చిత్ర విశేషాలను మీడియాతో ముచ్చటించారు అనిల్.
‘సినిమాను అందరికీ నచ్చేలా వినోదభరితంగా తీర్చిదిద్దాం. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ విపరీతంగా నచ్చుతుంది. కంటెంట్‌ను నమ్మి చేసిన చిత్రమిది. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. శర్వానంద్ పాత్రను చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఆయన కెరీర్‌కు ఈ చిత్రం మంచి బూస్ట్‌నిస్తుందీ .
హీరోయిన్లు సంయుక్త (Samyuktha), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్స్ అద్భుతంగా నటించారు. శ్రీ విష్ణు కామియో అదిరిపోతుంది. విజువల్స్, సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సినిమా క్షణం కూడా బోర్ కొట్టదు. ప్రేక్షకులకు మంచి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. విజయంపై పూర్తి నమ్మకముంది. ఈ చిత్రంతో పాటు సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.