షాకింగ్.. పవన్ - రీతూ చౌదరి బ్రేకప్
ABN , Publish Date - Sep 29 , 2026 | 10:04 PM
బిగ్ బాస్ జోడీగా, సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ పెయిర్‌గా గుర్తింపు పొందిన రీతూ చౌదరి (Rithu Chowdary),డీమోన్ పవన్ (Demon Pavan) జంట అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.
బిగ్ బాస్ జోడీగా, సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ పెయిర్‌గా గుర్తింపు పొందిన రీతూ చౌదరి (Rithu Chowdary),డీమోన్ పవన్ (Demon Pavan) జంట అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఒక భావోద్వేగపూరిత సుదీర్ఘమైన ప్రకటనను విడుదల చేశారు. తమ మధ్య ఉన్న స్నేహం పూర్తిగా ముగిసిపోయిందని ఆయన అధికారికంగా స్పష్టం చేశాడు.
రీతూ చౌదరితో సంబంధంపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీ, ఫేక్ రూమర్లపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో కనిపించేది, నిజ జీవితంలో జరిగేది రెండు వేర్వేరు విషయాలని, తమ మధ్య ఎవరూ ఎవరినీ వాడుకోలేదని, అది ఒక పరస్పర స్నేహబంధమని పేర్కొన్నాడు. అయితే గత కొన్ని నెలలుగా తమ మధ్య వ్యక్తిగత సమస్యలు, తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని, పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో మనశ్శాంతి కోసం ఇద్దరం విడివిడిగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే కాకుండా బ్లాక్ చేసుకున్నారని పవన్ వెల్లడించాడు.
రీతూ తనను వాట్సాప్, స్నాప్‌చాట్‌లో బ్లాక్ చేయడంతో, తాను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను తీసివేశానని, ఆ తర్వాత రీతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తనను బ్లాక్ చేసిందని వివరించాడు. అయితే తానైతే ఎలాంటి పాత పోస్టులను డిలీట్ చేయలేదని పవన్ స్పష్టత ఇచ్చాడు. ఇకపై రివాన్ అనే కాంబినేషన్ ఉండదని, తమ స్నేహం పూర్తిగా తెగిపోయిందని పవన్ తేల్చి చెప్పాడు. నెటిజన్లు అనవసరమైన ఊహాగానాలు ఆపి, తమ ప్రశాంతతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు ఎంతో క్యూట్‌గా ఉంటూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ వీడియోలు చేసిన ఈ పాపులర్ జోడీ ఇలా విడిపోవడం పట్ల వారి అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.