Adarsha Kutumbam: ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. చెప్పిన టైంకే వస్తుంది
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:06 PM
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఆదర్శ కుటుంబంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా, సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఈ సారి గురి తప్పదని డేట్ మారదని నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పష్టం చేశారు.
అక్టోబర్ 6న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి, అక్టోబర్ 7 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయన్నారు. అంఏటాక ఫ్యామిలీస్ అందరు మీ పిల్లలతో పరీక్షలు మంచిగా రాయించి సెలవులకు బాగా సూటయ్యే మా చక్కని యాక్షన్, కామెడీ సినిమాతో ఎంజాయ్ చేయండి అంటు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. థమన్ సంగీతం అందించిన ఈ హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రాన్ని అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు.