'పెద్ది'లో అబ్బనీ తీయని దెబ్బ రీమిక్స్.. బుచ్చిబాబు ఏమన్నాడంటే
ABN , Publish Date - Jun 03 , 2026 | 02:53 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను మర్చిపోవడం ఏ తెలుగు ప్రేక్షకుడి వలన కాదు అంటే అతిశయోక్తి లేదు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను మర్చిపోవడం ఏ తెలుగు ప్రేక్షకుడి వలన కాదు అంటే అతిశయోక్తి లేదు. అసలైన దేవకన్య అంటే ఇలాగే ఉంటుందేమో అనేంత అందంతో శ్రీదేవి కనిపించారు. ఈ చిత్రంలో వీరిద్దరి రొమాన్స్, కామెడీ వెరసి ఈ సినిమా ఒక ఐకానిక్ హిట్ గా నిలిచింది. ఇక ఈ స్టార్ ఇద్దరి వారసులు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కలిసి పెద్ది సినిమాలో నటించారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4 న రిలీజ్ కు సిద్దమయ్యింది. చరణ్, శ్రీదేవితో జగదేకవీరుడు అతిలోక సుందరి 2 తీస్తే ఎంత బావుంటుందో అని ప్రేక్షకులు కలలు కన్నారు. కానీ, అది కుదరకపోయినా కనీసం ఆ సినిమాలోని హిట్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ అయినా పెద్దిలో రీమిక్స్ చేస్తే బావుంటుందని కోరారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సినిమాలో ఆ సాంగ్ ఉందని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. తాజాగా ఆ ఆశలపై డైరెక్టర్ బుచ్చిబాబు నీళ్లు చల్లాడు. ఈ సాంగ్ పెద్దిలో లేదని తేల్చి చెప్పాడు.
'పెద్ది సినిమాలో ఈ పాటను రీక్రియేట్ లేదా రీమిక్స్ చేయలేదు. సినిమాలో వచ్చే ఒక పర్టిక్యులర్ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక రేడియోలో ఈ పాట ప్లే అవుతుంది. అయితే, ఆ సమయంలో సాంగ్ వస్తే ప్రేక్షకులు థియేటర్లలో డైవర్ట్ అయి, సినిమా కథలో నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని, ఆ సాంగ్ ని కూడా మ్యూట్ చేశామని' బుచ్చిబాబు వివరించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరి ఈ సినిమాతో చరణ్, జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.