మొన్న వెంకీ.. నేడు చిరు.. ఈ హీరోయిన్ లక్కే లక్కు
ABN , Publish Date - May 26 , 2026 | 08:47 PM
అందాల భామ నివేతా పేతురాజ్ (Nivetha Peturaj) నక్కతోక తొక్కిందా అంటే నిజమే అని అంటున్నారు నెటిజన్స్. తెలుగులో అంతంత మాత్రంగానే విజయాలను సొంతం చేసుకున్న నివేతా ఈ మధ్య పెద్ద పెద్ద ఛాన్స్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.
అందాల భామ నివేతా పేతురాజ్ (Nivetha Peturaj) నక్కతోక తొక్కిందా అంటే నిజమే అని అంటున్నారు నెటిజన్స్. తెలుగులో అంతంత మాత్రంగానే విజయాలను సొంతం చేసుకున్న నివేతా ఈ మధ్య పెద్ద పెద్ద ఛాన్స్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబోలో వస్తోన్న ఆదర్శ కుటుంబం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నివేతా నటిస్తోందని వార్తలు వచ్చాయి. అంటే గురూజీ అల వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా చేసింది కాబట్టి.. మళ్ళీ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడని అనుకున్నారు.
ఇక ఇప్పుడు నివేతా ఏకంగా మెగా ఛాన్స్ నే పట్టేసిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్నచిత్రం మెగా 158. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, పైగా ఈసారి పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో చిరు భార్యగా ప్రియమణి, కుర్ర హీరోయిన్ అనస్వర రాజన్.. కూతురిగా నటించబోతుంది.
ఇక ఈ భారీ యాక్షన్ డ్రామాలో కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు బాబీ, నివేతా పేతురాజ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర చాలా విభిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు ఆమెకు కథ, క్యారెక్టర్ డిజైనింగ్ వివరించగా.. మెగాస్టార్ సినిమా కావడంతో పాటు తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత నచ్చడంతో నివేథా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఇన్సైడ్ టాక్. భార్యగా ప్రియమణి కనిపిస్తుంది అంటే.. ఫ్లాష్ బ్యాక్ లో అమ్మడితో చిరు రొమాన్స్ ఉంటుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.