నయనతార, త్రిషల బాటలోనే నివేతా..
ABN , Publish Date - Jun 23 , 2026 | 09:25 PM
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇండస్ట్రీలో హీరోయిన్లందరూ ఇలాగే అనుకుంటారు. కొన్ని సినిమాలు చేశామా.. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నమా.. సరైన సమయంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామా అనేలానే ఉంటారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇండస్ట్రీలో హీరోయిన్లందరూ ఇలాగే అనుకుంటారు. కొన్ని సినిమాలు చేశామా.. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నమా.. సరైన సమయంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామా అనేలానే ఉంటారు. కొందరు పెళ్లి తరువాత సినిమాలు చేస్తారు.. మరికొందరు ఆపేస్తారు. అయితే.. కొందరికి రీఎంట్రీలు కలిసిరావు.. కానీ, ముగ్గురు హీరోయిన్లకు మాత్రం రీఎంట్రీ బాగా కలిసి వచ్చింది. అది కూడా పెళ్లి చేసుకుంటే కాదు.. పెళ్లి పెటాకులు చేసుకుంటే.. అంటే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాక వారి కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతోంది.
అందాల భామలు నయనతార, త్రిష ఇద్దరూ ఒక దశలో పెళ్లి చేసుకుని సినిమాలకు టాటా చెప్పేయాలని అనుకున్నారు. నయనతార ప్రభుదేవాతో, అలాగే త్రిష నిర్మాత వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్దమయ్యారు కూడా. కానీ, కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక.. పాత విషయాలను మర్చిపోయి సెకండ్ ఇన్నింగ్స్‌లో మునుపటి కంటే రెట్టింపు స్టార్‌డమ్‌తో దూసుకెళ్లారు. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో మలయాళ ముద్దుగుమ్మ నివేతా పేతురాజ్ కూడా కెరీర్‌లో ఫుల్ బిజీ అయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
గతేడాది నివేతా.. దుబాయ్ కి చెందిన బిజినెస్‌మ్యాన్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో నిశ్చితార్థం అయ్యినట్లు అధికారికంగా తెలిపింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ సంతోషించారు. అయితే సడెన్ గా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని, అతని నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఈ ఎదురుదెబ్బ తరువాత ఆమె కెరీర్ ముగిసిపోయింది అనుకున్నారు కానీ అదే నివేతా పేతురాజ్ కి పెద్ద ప్లస్ లా మారింది. ఇటీవలే విడుదలైన సింగ్ గీతం చిత్రంలో తక్కువ నిడివి ఉన్న పాత్ర పోషించినప్పటికీ ఆమె మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా రిలీజ్ టైంకే ఆమె ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్ల ప్రాజెక్టులలో ఆఫర్స్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ లోనూ నివేతా పేతురాజ్ కీలక పాత్రలు దక్కించుకుంది.
ఇవి తన సినీ ప్రస్థానంలోనే అతి పెద్ద అవకాశాలుగా భావిస్తున్న తరుణంలో, నివేతా చేతికి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. హీరో రామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నివేతా పేతురాజ్ కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో పెళ్లి రద్దు చేసుకుంటేనే ఈ హీరోయిన్లకు లక్ కలిసి వస్తుందేమో.. ఏదిఏమైనా నయనతార, త్రిషల మాదిరిగానే సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస భారీ ఆఫర్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న లక్కీ హీరోయిన్ల లిస్ట్‌లో నివేతా పేతురాజ్ కూడా చేరిపోయింది. మరి వారిలానే స్టార్ హీరోయిన్ గా నివేతా పేతురాజ్ మారుతుందా అనేది చూడాలి.