సైలెంట్‌గా 'అలియాస్ రుక్మిణీ' షూటింగ్
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:33 PM
నితిన్ నటిస్తున్న 'అలియాస్ రుక్మిణీ' సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా 'అలియాస్ రుక్మిణీ'. నితిన్ హీరో నటిస్తున్న ఈ సినిమాను 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి ఆయనే రచయిత కూడా. నాని సోదరి దీప్తి గంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కథతో ఓ విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
తాజాగా ఈ సినిమా పది రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్‌లో హీరో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఈ సినిమాను నాని ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన లైట్ హార్ట్ హాస్యంతో కూడిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సృజన అడుసుమిల్లి ఎడిటర్.