సముద్ర: డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా ‘నిలవే’ నిలిచింది
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:52 PM
'ప్రేమికుల రోజున విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ మంచి టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది.
'ప్రేమికుల రోజున విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ (nilave)మంచి టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు' అని దర్శకుడు సముద్ర అన్నారు. సౌమిత్ పోలాడి (Sowmith poladi) హీరోగా నటించి సాయి.కే.వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం 'నిలవే'. శ్రేయాసి సేన్ కథానాయిక. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మ్యూజికల్ లవ్ డ్రామాగా మంచి టాక్ తో నడుస్తోంది. మంగళవారం రామానాయుడు స్టూడియోలో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
జెమిని సురేష్ మాట్లాడుతూ 'చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు కలిగింది. బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్ ‘గీతాంజలి’లా ‘నిలవే’ చిత్రం నిలుస్తుంది' అన్నారు.
హీరో సౌమిత్ మాట్లాడుతూ 'అంతా కొత్త వాళ్ళం.. మూడేళ్ల కష్టంతో ఈ సినిమా తీసుకొచ్చాం. రాజమౌళి గారు కూడా ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్ చూసి ఎంతో ఆనందిస్తున్నాం. జెన్యూన్ హిట్‌గా మా చిత్రం నిలిచింది' అన్నారు.
దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ 'మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి అనేది ఈ చిత్రంతో తెలుసుకున్నాను. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను' అన్నారు.