నిహారిక: అది చేస్తే ఇది అన్నారు.. ఇది చేస్తుంటే అది అంటున్నారు..

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:49 PM

నేను ఏ సినిమా ప్రారంభించినా.. అదెందుకు.. ఇదెందుకు అంటూ చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సలహాలూ ఇస్తున్నారు.


‘నేను ఏ సినిమా ప్రారంభించినా.. అదెందుకు.. ఇదెందుకు అంటూ చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సలహాలూ ఇస్తున్నారు. ఎవరెన్ని అన్నా నేను చేసేది చేస్తూనే ఉంటా. నిర్మాతగా ఇప్పటిదాకా నా ప్రయత్నాలన్నీ సక్సెస్‌ఫుల్‌గానే జరిగాయి. ఇకపై కూడా అలాగే ఉంటుందని నమ్మకం ఉంది’ అని నిహారిక కొణిదెల అన్నారు.

మానసశర్మను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సంగీత్‌ శోభన్‌, నయన్‌సారిక జంటగా జీ స్టూడియోస్‌ సమర్సణలో నిహారిక నిర్మించిన చిత్రంలో ‘రాకాసా’. ఏప్రిల్‌ మూడో తేదిన ఈ చిత్రం విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిమారిక మాట్లాడుతూ ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో కొత్తవారిని 11 నుంచి 15 మందిని పరిచయం చేశా. కొత్తవాళ్లతో ఇలాంటి ప్రయోగాలు ఎందుకని చాలామంది కామెంట్‌ చేశారు. ‘రాకాసా’ స్టార్ట్‌ చేసినప్పుడు ‘కమిటీ కుర్రోళ్లు’లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అన్నారు.. ‘బరి’ చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు? అని అంటున్నారు. నేను ఏం చేసినా ఇలా అనేవాళ్లు అంటూనే ఉంటారు. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటాను. నేను నా ప్రతీ సినిమాతో కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాను. నాకు కొణిదెల ఫ్యామిలీ, పింక్‌ ఎలిఫెంట్‌ ఫ్యామిలీ రెండూ సమానమే. నా మీద నమ్మకం పెట్టుకుని, నాకు ఫ్రీడం ఇచ్చిన నా తల్లిదండ్రులకు థాంక్స్‌. ‘రాకాసా’ మా అందరికీ మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది. మానస శర్మ టాలెంట్‌ నాకు తెలుసు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. సంగీత్‌ శోభన్‌ యాక్టింగ్‌ స్టైల్‌ బావుంటుంది. ఈ సినిమా సక్సెస్‌లో అతనికి సింహ భాగం దక్కుతుంది. నయన్‌ సారికలో ఓ ప్రత్యేకత ఉంది. అది తెరపైనే చూడాలి. వందశాతం నిజాయతీగా ఈ సినిమా చేశాం. మా పింక్‌ ఎలిఫెంట్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీ ట్రిప్స్‌కు వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్‌ 3న రాబోతోన్న ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు.

నయన్‌ సారిక మాట్లాడుతూ ‘నిహారికతో నేను చేస్తున్న మూడో ప్రాజెక్ట్‌ ఇది. ఆమెతో పని చేస్తే లక్‌ కలిసి వస్తుంది. ‘రాకాస’తో మళ్లీ ఆమెతో పని చేయడం ఆనందంగా ఉంది. మానస శర్మకు సినిమా పట్ల చాలా ఫోకస్‌, క్లారిటీ ఉంది.  ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 04:54 PM