ఇంటిమేటెడ్ సీన్స్ కోసం బలవంతం.. నిహారిక చేసిన పనికి షాక్
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:41 PM
తెరపై మెరవాలని ప్రతీ నటుడికీ ఉంటుంది. ఒక మంచి అవకాశం వస్తే దానికోసం ఎంతో శ్రమిస్తారు. కానీ తన మనస్సాక్షికి, తాను గీసుకున్న హద్దులకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదనే బలమైన నిర్ణయంతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను వదులుకుని వార్తల్లో నిలిచింది నటి నిహారిక ఎన్ ఎమ్.
తెరపై మెరవాలని ప్రతీ నటుడికీ ఉంటుంది. ఒక మంచి అవకాశం వస్తే దానికోసం ఎంతో శ్రమిస్తారు. కానీ తన మనస్సాక్షికి, తాను గీసుకున్న హద్దులకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదనే బలమైన నిర్ణయంతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను వదులుకుని వార్తల్లో నిలిచింది నటి నిహారిక ఎన్ ఎమ్ (Niharika NM). ఇన్ఫ్లూయెన్స్రర్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. హీరోయిన్ గా మారింది నిహారిక. తెలుగులో మిత్ర మండలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా ఈ చిన్నదాని గురించిన ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆడిషన్ పూర్తి చేసుకుని, కాంట్రాక్ట్ పై సంతకం చేసిన తర్వాత కూడా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె ఆ సినిమా నుంచి బయటకు రావడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయం ఏంటంటే.. నిహారిక ఎన్ ఎమ్ ఒక సినిమా కథ నచ్చి ఒప్పుకోని కాంట్రాక్ట్ మీద కూడా సంతకం చేసింది. సినిమా కాంట్రాక్ట్ పూర్తయ్యాక అందులోని కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేయడం తనకు అసౌకర్యంగా ఉంటుందని నిహారిక చిత్ర యూనిట్‌కు స్పష్టంగా తెలిపింది. దానికి సమ్మతించిన నిర్మాతలు, ఆ సన్నివేశాల్లో ఆమెకు బదులుగా బాడీ డబుల్ ని ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. అయితే షూటింగ్ సమయానికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. సినిమాలో నటిస్తున్న హీరో బాడీ డబుల్‌తో ఆ సీన్స్ చేయడానికి నిరాకరించాడు. దీంతో మేకర్స్ మాట మార్చి, ఆ సీన్స్ నిహారికనే స్వయంగా చేయాలని, లేకపోతే సినిమా నుండి తప్పుకోవాలని స్పష్టం చేశారు. వేరే హీరోయిన్ అయితే తప్పక చేసి ఉండేదేమో కానీ.. నిహారిక మాత్రం మేకర్స్ కే షాక్ ఇచ్చిందట.
తాను ఎంతగానో చేయాలనుకున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ, తొలినుంచీ తాను పాటిస్తున్న హద్దులను దాటకూడదనే ఉద్దేశంతో నిహారిక ఆ సినిమా నుంచి వైదొలగడానికే మొగ్గుచూపినట్లు టాక్ నడుస్తోంది. అవకాశాల కోసం విలువలను పక్కనపెట్టే ఈ రోజుల్లో, తన హద్దులను కాపాడుకోవడానికి ఎంతటి పెద్ద అవకాశాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడటం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఆ సినిమా ఏంటి.. ? హీరో ఎవరు.. ? అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.